- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kolkata: మమతా బెనర్జీకి లై డిటెక్టర్ పరీక్ష .. బీజేపీ డిమాండ్
దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేసింది. కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసనలు ఆందోళనకరంగా మారగా, ఈ క్రమంలో బీజేపీ నేతలు మమతపై విరుచుకుపడ్డారు. హత్యాచారం కేసులో ప్రమేయం ఉన్న వారికి టీఎంసీ నేత రక్షణ కల్పిస్తున్నారని, ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మమతా బెనర్జీని "నియంత" గా వారు అభివర్ణించారు.
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్‌లో ఏం జరిగినా ఆందోళనకరమే. ఇది రాజ్యాంగాన్ని ముక్కలు చేయడం లాంటిది. దేశంలో నియంత ఎవరైనా ఉన్నారంటే అది మమతా బెనర్జీయేనని స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. అలాగే, అత్యాచారం, హత్యను కోల్‌కతా పోలీస్ కమిషనర్ ఆత్మహత్యగా అభివర్ణించారు, కమిషనర్ వినీత్ గోయెల్‌పై కూడా పాలీగ్రాఫ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.