- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Mayawati: బీజేపీ, కాంగ్రెస్‌లు ఓబీసీలకు బద్ధ వ్యతిరేకులు : మాయావతి

దిశ, నేషనల్ బ్యూరో: కుల గణన అంశంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య పార్లమెంటులో కొనసాగుతున్న వాగ్యుద్ధంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. ఆ రెండు పార్టీలు కూడా ఓబీసీలకు బద్ధ వ్యతిరేకులని ఆమె వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్, బీజేపీలు పార్లమెంటులో డ్రామాలు వేస్తూ ఓబీసీలను మోసం చేసేందుకు యత్నిస్తున్నాయి’’ అని మాయావతి మండిపడ్డారు. ‘‘ఆ పార్టీల చరిత్రను పరిశీలిస్తే.. అవి అన్ని దశలలోనూ ఓబీసీలకు వ్యతిరేకంగానే వ్యవహరించాయి. అది నగ్న సత్యం’’ అని ఆమె విమర్శించారు.ఈమేరకు ఎక్స్ వేదికగా బీఎస్పీ అధినేత్రి ఒక పోస్ట్ చేశారు. గతంలో బీఎస్పీ హయాంలోనే యూపీలో ఓబీసీ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయన్నారు. జాతీయస్థాయిలో కుల గణన అనేది ప్రజలకు ప్రయోజనం కలిగించే అంశమని.. దాన్ని తమ పార్టీ తప్పకుండా సమర్ధిస్తుందని మాయావతి స్పష్టం చేశారు. ఈవిషయమై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరించాలని కోరారు. కోట్లాది మంది పేదలు, వెనుకబడిన వర్గాలు, బహుజనులకు దేశ అభివృద్ధిలో హక్కు దక్కాలంటే కుల గణన జరగాల్సిందేనన్నారు.