BIG News: భారత్ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం: స్వాతంత్య్ర దినోత్సవ వేళ ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-08-15 03:22:47.0  )
BIG News: భారత్ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం: స్వాతంత్య్ర దినోత్సవ వేళ ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇవాళ 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన 11వ సారి దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ప్రధాని జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. నాడు దేశం కోసం పోరాడిన మహనీయులను దేశం ఎల్లప్పుడూ స్మరించుకుంటుందని అన్నారు. దేశానికి స్వేచ్ఛా వాయువులు అందించిన త్యాగ ధనుల స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.

ఎందరో మహానుభావులు ఈ దేశం కోసం జీవితాలను పణంగా పెట్టారని.. అలాంటి మహనీయులకు దేశం BIG News: భారత్ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం: ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యఖ్యలురుణపడి ఉంటుందని అన్నారు. దేశ వ్యాప్తంగా ఘనంగా ‘హర్‌ ఘర్‌ తిరంగా’ వేడుకలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. భారత్ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని తెలిపారు. 2047 వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. స్వాంతంత్ర్యం కోసం 40 కోట్ల మంది పోరాడారని వారి ఆంకాంక్షలను సాధించేందుకు 140 కోట్ల మంది పోరాడాలని ఆకాంక్షించారు.

తమ ప్రభుత్వం పరిపూర్ణమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. కొన్నాళ్లుగా దేశాన్ని వరుస విపత్తులు ఇబ్బది పెడుతున్నాయని, బాధిత కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియాజేశారు. దళితులు, పీడితులు ఆదివాసీలు గౌరవంగా బ్రతకాలని అన్నారు. దేశాభివృద్ధికి భారీ ప్రణాళికలు అవసరమని పేర్కొన్నారు. ప్రపంచానికే భారత్ అన్నం పెట్టే స్థాయికి ఎదగాలని అన్నారు. ఇక తయారీ రంగంలో భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చాలని అన్నారు. అదేవిధంగా భారత న్యాయ వ్యవస్థలు సంస్కరణలు కూడా అవసరమని ప్రధాని అన్నారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story