- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పాఠ్య పుస్తకంలో బాబ్రీ మసీదు ప్రస్తావన తొలగింపు
by Hajipasha |

X
దిశ, నేషనల్ బ్యూరో : ఎన్‌సీఈఆర్‌టీ 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్య పుస్తకాలలో ఐదు కీలకమైన మార్పులు జరిగాయి. పొలిటికల్ సైన్స్ పాఠ్యపుస్తకంలోని 8వ అధ్యాయంలో రామజన్మభూమి ఉద్యమం గురించి ఉంది. ఇందులో బాబ్రీ మసీదుకు సంబంధించిన మూడు ప్రస్తావనలను తొలగించారు. ఇక 1989 సార్వత్రిక ఎన్నికల తర్వాతి నుంచి కాంగ్రెస్ పార్టీ పతనం జరిగిన తీరు గురించి ఓ పాఠ్యాంశంలో ప్రస్తావించారు. 1990 మండల్ కమిషన్, 1991లో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలు, రాజీవ్ గాంధీ హత్యకు సంబంధించిన సమాచారంలో కొన్ని సవరణలు చేశారు. ప్రత్యేకించి చరిత్ర విభాగంలో.. ఆర్యన్ వలస సిద్ధాంతం ఆధారంగా హరప్పా నాగరికతలో ఆధునిక భారతదేశ మూలాల అంశాన్ని ఈసారి పాఠం రూపంలో ప్రజెంట్ చేశారు. ఇక 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న చరిత్ర, సోషియాలజీ పుస్తకాలలోనూ పలు మార్పులు చేశారు.
Next Story