- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
25,753 మంది జాబ్స్ రద్దు.. ఎనిమిదేళ్ల శాలరీ వాపస్ ఇవ్వండి : హైకోర్టు
దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికలు జరుగుతున్న వేళ పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కుదిపేసే సంచలన తీర్పును కోల్‌కతాా హైకోర్టు డివిజన్ బెంచ్ సోమవారం వెలువరించింది. 2016 సంవత్సరంలో స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్ ద్వారా భర్తీ చేసిన 25,753 ఉద్యోగాలను రద్దు చేస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అప్పట్లో ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీలో అవకతవకలు జరిగాయని కోర్టు వెల్లడించింది. ఆనాడు నోటిఫికేషన్ ద్వారా జాబ్స్ పొందిన వాళ్లంతా గత ఎనిమిదేళ్లుగా తీసుకున్న శాలరీలను 12 శాతం వడ్డీతో కలిపి నాలుగు వారాల్లోగా తిరిగి ఇచ్చేయాలని సూచించింది. ఆ డబ్బు వసూలు బాధ్యతలను ఆయా ఉద్యోగులు నివసించే జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దేశించింది.
మళ్లీ ఫ్రెష్‌గా పోస్టుల భర్తీ..
2016 సంవత్సరంలో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 9 నుంచి 12 తరగతులకు ఉపాధ్యాయులతో పాటు గ్రూప్ సీ, గ్రూప్ డీ సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తం 24,650 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా పరీక్షకు 23 లక్షల మందికిపైగా హాజరయ్యారు. అయితే 25,753 మందికి అపాయింట్‌మెంట్ లెటర్లను ఇచ్చారు. తాజాగా హైకోర్టు ఆదేశాలతో వీరంతా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. అప్పట్లో రాష్ట్రస్థాయి ఎంపిక పరీక్ష రాసిన మొత్తం 23 లక్షల మంది అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను మళ్లీ మూల్యాంకనం చేయించాలని హైకోర్టు సోమవారం ఆదేశించింది. మళ్లీ ఫ్రెష్‌గా 25,753 పోస్టుల భర్తీ ప్రక్రియను మొదలుపెట్టాలని..15 రోజుల్లోగా నియామక ప్రణాళికను సిద్ధం చేయాలని బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్‌కు సూచించింది. 2016లో జరిగిన జాబ్ రిక్రూట్‌మెంట్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి మూడు నెలల్లోగా నివేదికను సమర్పించాలని సీబీఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సీబీఐ దర్యాప్తు కొనసాగించొచ్చని, ఈ కేసులో ఎవరినైనా కస్టడీలోకి తీసుకోవచ్చని పేర్కొంది. టీచర్ల భర్తీకి సంబంధించిన ఈ కుంభకోణంలో రాష్ట్ర మాజీ విద్యాశాఖ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత పార్థా ఛటర్జీని ఇప్పటికే ఈడీ అరెస్టు చేసింది.
25,753 ఉద్యోగాల రద్దు చట్టవిరుద్ధం : దీదీ
బెంగాల్‌లోని రాయ్‌గంజ్‌లో ఎన్నికల ప్రచారం చేస్తున్న సీఎం మమతా బెనర్జీ కోల్‌కతా హైకోర్టు తీర్పుపై ఘాటుగా స్పందించారు. ఏకంగా 25,753 మంది ఉద్యోగాలను రద్దు చేయడం చట్టవిరుద్ధమన్నారు. ఈ తీర్పును ఎగువ న్యాయస్థానంలో సవాల్ చేస్తామని వెల్లడించారు. న్యాయవ్యవస్థను, తీర్పులను బీజేపీ నాయకులు ప్రభావితం చేస్తున్నారని దీదీ ఆరోపించారు. 2016లో ఉద్యోగాల్లో భర్తీ అయిన 26వేల మంది టీచర్లంటే 1.5 లక్షల కుటుంబాలు. వారంతా గత 8 ఏళ్ల వేతనాన్ని 4 వారాల్లో చెల్లించడం ఎలా సాధ్యమవుతుందని మమతా బెనర్జీ ప్రశ్నించారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి అండగా ఉంటామని దీదీ హామీ ఇచ్చారు. వారందరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు.
ఈ తీర్పు.. సువేందుకు ముందే ఎలా తెలుసు ?
‘‘ఇలాంటి తీర్పు రాబోతోందని బీజేపీ నేత సువేందుకు ముందే ఎలా తెలుసు? 26 వేల మంది ఉద్యోగాల్ని లాక్కోవడమే ఆయన చెప్పిన విస్పోటనమా? ఉద్యోగుల్ని ప్రమాదంలోకి నెట్టడమా. కోర్టు తీర్పు ఎలా వస్తుందో వాళ్లకు ఎలా తెలుసు?’’ అని దీదీ ప్రశ్నించారు. కాగా, గత వారం ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సోమవారం కోసం వేచి ఉండండి. భారీ విస్పోటనం అధికార టీఎంసీని విచ్ఛిన్నం చేస్తుంది. దాని నుంచి వారు కోలుకోలేరు’ అని పార్టీ కార్యకర్తలతో అన్నారు.