- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Chinmoy Krishnadas: చిన్మయి కృష్ణదాస్ పై బంగ్లాదేశ్ లో మరో కేసు నమోదు

దిశ, నేషనల్ బ్యూరో: ఇస్కాన్ (ISKCON)కు చెందిన చిన్మయి కృష్ణదాస్ (Chinmoy Krishnadas)పై బంగ్లాదేశ్ (Bangladesh)లో మరో కేసు నమోదైంది. ఇప్పటికే అరెస్టయి జైళ్లో ఉన్న కృష్ణదాస్ పై కొత్తగా మరో కేసు నమోదు చేసినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి. చిట్టగాంగ్ కోర్టు ప్రాంగణంలో కృష్ణదాస్ మద్దతుదారులు, పోలీసులకు మధ్య గొడవ జరిగింది. దీంతో, కృష్ణదాస్ సహా 164 మందిపై దేశద్రోహం కేసు నమోదుచేసినట్లు సమాచారం. నవంబర్ 26న చిట్టగాంగ్ కోర్టు ప్రాంగణంలో సంప్రదాయ దుస్తులు ధరించినందుకు కృష్ణదాస్ అనుచరులు తనపై దాడి చేసినట్లు హెఫాజాత్-ఎ-ఇస్లాం బంగ్లాదేశ్ కార్యకర్త, వ్యాపారవేత్త ఇనాముల్ హక్ ఆరోపించారు. దాడిలో తన కుడి చేయి, తలకు తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్ లో చేరాల్సి వచ్చిందని.. అందుకే ఆలస్యంగా పోలీసులను ఆశ్రయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇనాముల్ హక్ ఫిర్యాదు మేరకు మరో 400-500 మంది గుర్తుతెలియని వ్యక్తులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైన వారిపై చర్యలు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, డిసెంబర్ 3న బంగ్లాలోని మూవీ థియేటర్ వద్ద రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తలు ఇస్కాన్ సభ్యులపై దాడికి పాల్పడ్డట్లు మరో వ్యాపారవేత్త ఫిర్యాదు చేశాడు.
కృష్ణదాస్ అరెస్టు
బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ప్రచారకర్తగా పనిచేస్తున్న చిన్మయ్ కృష్ణదాస్ గత నెలలో అక్కడ జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈక్రమంలో బంగ్లాదేశ్ జెండాను ఉద్దేశించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఢాకా విమానాశ్రయంలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో, అక్కడ చెలరేగిన అల్లర్లలో ఓలాయర్ చనిపోయారు. దీంతో, అంతర్జాతీయ శ్రీకృష్ణ సమాజం (ఇస్కాన్) కార్యకలాపాలపై నిషేధం విధించాలని ఓ న్యాయవాది పిటిషన్ వేయగా.. బంగ్లా హైకోర్టు దానిని కొట్టివేసింది. మరోవైపు, కోర్టులో కృష్ణదాస్ తరఫున వాదించేందుకు వచ్చిన లాయర్లపై దాడులకు పాల్పడుతున్నారు. దీంతో, ఆయన బెయిల్ పై వాదనలు వినిపించేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. ఇకపోతే, జనవరిలో ఆయన బెయిల్ పిటిషన్ విచారణ జరగనుంది. అప్పటివరకు కృష్ణదాస్ జైళ్లోనే ఉండనున్నారు.