- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bangladesh: రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్ జమాత్-ఎ-ఇస్లామీ నిషేధించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం
దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ ప్రభుత్వం గురువారం రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్ జమాత్-ఎ-ఇస్లామీ, దాని యువజన విభాగం ఇస్లామీ ఛత్ర శిబిర్‌లను నిషేధించింది. ఇటీవల దేశంలో ప్రభుత్వ ఉద్యోగ కోటాలకు వ్యతిరేకంగా విద్యార్థుల నిరసనల సందర్భంగా అశాంతికి కారణమైనందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వివక్షకు వ్యతిరేకంగా విద్యార్థులు గతనెలలో దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించారు. ఈ నిరసనల్లో కనీసం 206 మంది మరణించారు. అయితే, ఇంత భారీ స్థాయిలో హింసకు, ప్రజా ఆస్తుల నష్టానికి అతిపెద్ద ఇస్లామిస్ట్ గ్రూప్ అయిన రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్ కారణమని ఆరోపించింది. ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేస్తూ బంగ్లాదేశ్ ఉగ్రవాద నిరోధక చట్టంలోని సెక్షన్ 18(1) ప్రకారం గ్రూప్, దాని యువజన విభాగాన్ని నిషేధించింది. కొత్త నోటిఫికేషన్ ప్రకారం ఈ రెండు సంస్థలు ఇప్పుడు 'మిలిటెంట్, టెర్రరిస్ట్' సంస్థలుగా పరిగణించబడతాయి. అంతేకాకుండా ఈ సంస్థలు రాజకీయ పార్టీలుగా కార్యకలాపాలు నిర్వహించలేదని బంగ్లాదేశ్ న్యాయ మంత్రి అనిసుల్ హక్ ప్రోథోమ్ అలోతో పేర్కొన్నారు. జమాత్-ఎ-ఇస్లామీ బ్రిటీష్ వలస పాలన కాలంలో 1941 ఏడాది స్థాపించబడింది. 1971లో పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాడే సమయంలో బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడేందుకు వ్యతిరేకంగా ప్రచారం చేసింది.