Independence Day: ఆగస్టు 15న అప్రమత్తంగా ఉండండి.. ప్రజలకు కేంద్రం హెచ్చరికలు..

by Javid Pasha |   ( Updated:2022-08-12 09:46:10.0  )
Avoid Large Gatherings follow Covid Guidelines In Independence Day Celebrations
X

దిశ, వెబ్‌డెస్క్: Avoid Large Gatherings follow Covid Guidelines In Independence Day Celebrations| భారతదేశ 75 స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. దేశంలోని ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకం రెపరెపలాడాలని కేంద్ర ప్రభుత్వ 'హర్ ఘర్ తిరంగ' కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల్లో జాతీయ జెండాలను ప్రజలకు పంపిణీ చేస్తుంది. మరో మూడు రోజుల్లో రానున్న స్వాతంత్ర దినోత్సవాన్ని అట్టహాసంగా పురస్కరించుకునేందుకు ప్రజలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఆగస్టు 15న అప్రమత్తంగా ఉండాలని సూచనలు ఇచ్చింది. ఎక్కువమంది ఒకేచోట గుమికూడద్దని ప్రజలకు తెలిపింది. అయితే దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోందని, కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ తెలిపింది.

'ముందస్తు జాగ్రత్తలు, కరోనా నియంత్రణలో భాగంగా అత్యధిక సంఖ్యలో ప్రజలు ఒకే చోట గుమికూడటం మంచిది కాదు. ప్రతి ఒక్కరూ ఆగస్టు 15న కరోనా నిబంధనలను తూచా తప్పకుండా పాటించండి. ఎక్కువ మంది ఒకే ప్రదేశంలో గుమిగూడకుండా ఉండేలా జాగ్రత్త పడండి' అని ప్రజలను కోరింది. ఇదిలా ఉంటే ఇండియా గత 24 గంటల్లో 16,561 కొత్త కరోనా కేసులను నమోదు చేసింది. వీటితో దేశంలోని మొత్తం కరోనా కేసులు 4,42,23,557కు చేరుకున్నాయి. వాటిలో 1,23,535 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో పాటుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా శాఖలు స్వాతంత్ర దినోత్సవం నాడు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని, వాతావరణానికి మొక్కల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన సమావేశాలు నిర్వహించాలని కోరింది.

ఇది కూడా చదవండి: మూడు స‌ముద్రాలు క‌లిసే చోట 75 అడుగుల మువ్వ‌న్నెల జెండా

Advertisement

Next Story

Most Viewed