Assam: ఇకపై ముస్లిం వివాహం, విడాకుల రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి: అస్సాం సీఎం

by S Gopi |
Assam: ఇకపై ముస్లిం వివాహం, విడాకుల రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి: అస్సాం సీఎం
X

దిశ, నేషనల్ బ్యూరో: అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం గురువారం రాష్ట్ర అసెంబ్లీలో కీలక బిల్లును ప్రవేశపెట్టింది. అస్సాం ముస్లిం వివాహాలు, విడాకుల నమోదు చట్టం-1935ను రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం బిల్లును ఉంచింది. ఈ చట్టం బ్రిటీష్ కాలం నాటిదని, ఇది ముస్లిం మైనర్ వివాహాల నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం తెలిపింది. ముస్లిం వివాహాలు, విడాకుల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేస్తూ తెచ్చిన అస్సాం కేబినెట్‌ ఆమోదించిన ఒకరోజు తర్వాత అస్సాం రెవెన్యూ, విపత్తు నిర్వహణ మంత్రి జోగెన్ మోహన్ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. అస్సాం కంపల్సరీ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ మార్యేజ్‌ అండ్‌ డివోర్స్‌ బిల్లు-2024కు మెజారిటీ సభ్యులు అంగీకరించడం బిల్లు ఆమోదం పొందింది. దీనివల్ల బాల్య వివాహాలను నిషేధించడం వీలవుతుందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. అంతేకాకుండా ఇప్పటివరకు ముస్లిం మతపెద్దలు వివాహాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను చూసేవారని, ఇకమీదట అటువంటి ప్రక్రియ ఉండదని వెల్లడించారు. కొత్త బిల్లు ఆమోదంతో ముస్లిం వివాహాల రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో జరుగుతుందని స్పష్టం చేశారు.

Advertisement

Next Story