- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అరుణాచల్‌ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే: చైనా వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ స్పందన
దిశ, నేషనల్ బ్యూరో: అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రధాని మోడీ ప్రకటించడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అంతేగాక అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమేనని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కర్నల్ ఝాంగ్ షియాంగాంగ్ ఇటీవల వ్యాఖ్యానించారు. తాజాగా దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగంగానే ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అరుణాచల్‌పై చైనా మంత్రిత్వ శాఖ చేసిన వ్యాఖ్యలను గమనించామని, అవి పూర్తిగా అసంబద్దమని పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌ను భారత్ నుంచి విడదీయలేరని తేల్చి చెప్పారు. ఆ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. నిరాధారమైన వాదనలు చేయొద్దని చైనాకు సూచించారు. కాగా, అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా పేర్కొంటున్న చైనా.. ఆ రాష్ట్రంలో భారత నేతలు పర్యటించినప్పుడల్లా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాంతానికి జాంగ్నాన్ అని కూడా పేరు పెట్టింది. అయితే భారత్ సైతం నిరంతరం చైనా వ్యాఖ్యలను తిప్పికొడుతుంది.