- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
17 వేల అడుగుల ఎత్తులో ‘యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి’ని పరీక్షించిన ఆర్మీ
దిశ, నేషనల్ బ్యూరో: భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కార్ప్స్ సిక్కింలో 17 వేల అడుగుల ఎత్తైన ప్రదేశంలో యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణుల(ఏటీజీఎం) కాల్పులతో కూడిన శిక్షణా వ్యాయామం నిర్వహించినట్టు డిఫెన్స్ పీఆర్ఓ తెలిపారు. తూర్పు కమాండ్‌లోని మెకనైజ్డ్, పదాతి దళం నుంచి క్షిపణి ఫైరింగ్ డిటాచ్‌మెంట్‌లు శిక్షణా వ్యాయామంలో పాల్గొన్నాయి. ఇందులో సమగ్ర శిక్షణ, వివిధ ప్లాట్‌ఫామ్‌ల నుంచి లైవ్ ఫైరింగ్, యుద్ధభూమిలో పరిస్థితుల ఆధారంగా లక్ష్యాలను నిర్దేశించబడ్డాయి. ఏటీజీఎం డిటాచ్‌మెంట్లు అసమానమైన సాయుధ దాడులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ప్రమాదకరమైన పర్వతాలపై మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేస్తాయి. ఎక్కువ ఎత్తున్న పరిసరాల్లో ఏటీజీఎం వ్యవస్థ పనితీరు 'ఏక్ మిస్సైల్ ఏక్ ట్యాంక్ ' విధానంలో లక్ష్యాలను పూర్తి చేస్తుంది. అలాగే, ఎక్కువ ఎత్తున్న ప్రాంతాల్లో ఏటీజీఎం వ్యవస్థ ఖచ్చితమైన లక్ష్యాన్ని ప్రభావవంతంగా ప్రదర్శిస్తుందని డిఫెన్స్ పీఆర్ఓ పేర్కొంది.