- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Delimitation : దక్షిణాదిన ఊపందుకుంటున్న డిలిమిటేషన్ వ్యతిరేక ఉద్యమం

దిశ, వెబ్ డెస్క్ : జనాభా ప్రాతిపదికన నియోజక వర్గాల పునర్విభజన(Delimitation) చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. కాగా కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న ఈ డిలిమిటేషన్ ప్రక్రియను దక్షణాది రాష్ట్రాలు(South States) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సాధారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా అత్యంత ఎక్కువగాను, దక్షిణాది రాష్ట్రాల్లో తక్కువగాను ఉంటుంది. అయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 60, 70 దశబ్దాల్లో ఉత్తర, దక్షిణ భారత దేశాలలో జనాభా ఎక్కువగానే ఉండేది. ఇందిరా గాంధీ పాలనలో తీసుకువచ్చిన 'ప్రభుత్వ ఉద్యోగులు కేవలం ఇద్దరు పిల్లలను మాత్రమే కలిగి ఉండాలనే నిబంధన' వలన దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గుతూ వచ్చింది. తక్కువ జనాభా కలిగి ఉండటం వలన ఇక్కడి పాలకులు కూడా మంచి వసతులు కల్పించగలిగారు.
దేశంలో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలను పరిశీలిస్తే.. దక్షిణాది రాష్ట్రాలే ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నాయి. అయితే ఎన్డీఏ(NDA) ప్రభుత్వం దక్షిణాదిన తన పూర్తి సత్తా చాటలేకపోవడం అనేది ముమ్మాటికీ నిజం. కాబట్టి ఎలాగైనా పార్లమెంటు(Parliament)లో ఇక్కడి రాష్ట్రాల బలం తగ్గించే ప్రయత్నంలో భాగమే ఈ డిలిమిటేషన్ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనిని దక్షిణాది పాలకులు, నేతలు గట్టిగానే వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడు(Tamilanadu) ఈ విషయంలో ముందునుంచి కేంద్రంతో గట్టిగా పోరాడుతోంది. తమిళపార్టీల సమావేశంలో డిలిమిటేషన్ ప్రక్రియను ఒప్పుకునేది లేదని తేల్చిపారేసింది. ఒకవేళ ఆ ప్రక్రియను తీసుకురావాలి అనుకుంటే 1971 జనాభా లెక్కల ప్రాతిపదికన చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో తమిళ పార్టీలు దక్షిణాది రాష్ట్రాల పాలకులను, నేతలను డిలిమిటేషన్ కు వ్యతిరేకంగా ఒక్కటి చేస్తున్నాయి.
ఈ క్రమంలో ఏపీ మాజీ సీఎం జగన్(AP Former CM Jagan) కలిసి ఈ నెల 22న చెన్నైలో దక్షిణ భారత అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించారు. ఈ మేరకు సీఎం స్టాలిన్(CM Stalin) రాసిన లేఖను తమిళ మంత్రులు ఈవీ వేలు, ఎంపీ విల్సన్ లు అందించారు. మరోవైపు తెలంగాణ(Telangana)లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం డిలిమిటేషన్ కు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలను ఒక్కటి చేసేందుకు నడుం బిగించింది. త్వరలో అన్ని పార్టీల నేతలతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని, తెలనగణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు అతీతంగా అందరూ హాజరవ్వాలని ఓ లేఖ విడుదల చేసింది.