బీజేపీలో చేరిన మరో ఎమ్మెల్యే..మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు షాక్

by samatah |
బీజేపీలో చేరిన మరో ఎమ్మెల్యే..మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు షాక్
X

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీలో జాయిన్ కాగా.. తాజాగా మరో ఎమ్మెల్యే బీజేపీ గూటికి చేరారు. సాగర్ జిల్లాలోని బినా నియోజకవర్గ ఎమ్మెల్యే నిర్మలా సప్రే ఆదివారం కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. రహత్ గఢ్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం మోహన్ యాదవ్ ఆమెను పార్టీలోని ఆహ్వానించారు. అనంతరం సప్రే మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి అభివృద్ధి ఎజెండా లేదని ఆరోపించారు. ప్రధాని మోడీ, సీఎం మోహన్ యాదవ్‌ల నేతృత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, వారి విధానాలకు ఆకర్షితులై బీజేపీలో చేరినట్టు తెలిపారు. కాంగ్రెస్‌లో ఉంటూ తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోతున్నానని చెప్పారు. దీంతో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు చేరుకుంది. అంతకుముందు చింద్వారా జిల్లాలోని అమర్‌వార ఎమ్మెల్యే కమలేష్ షా, ఎమ్మెల్యే రాంనివాస్ రావత్ కూడా కాంగ్రెస్ ను వీడి బీజేపీలో జాయిన్ అయ్యారు. కాగా, ఇండోర్ లోక్‌సభ అభ్యర్థి అక్షయ్‌కాంతి బామ్ తన నామినేషన్ ఉపసంహరించుకుని బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story