- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Maha Kumbh Mela : కుంభమేళాలో మరో ప్రమాదం..8మంది మృతి

దిశ, వెబ్ డెస్క్ : మహా కుంభమేళా(Maha Kumbh Mela) పర్వంలో మరో ప్రమాదం(Another Accident) చోటుచేసుకుంది. ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా సంగమ స్థలిలో పుణ్య స్నానాల కోసం వెలుతున్న భక్తులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రాజస్థాన్ జైపూర్(Rajasthan Jaipur) నుంచి కుంభమేళాకు భక్తులతో వెళ్తున్న కారు మోఖంపుర సమీపంలోని జాతీయ రహదారి 48పైన డివైడర్ ను ఢీకొట్టి(Car Accident).. బస్సు(Bus)పైకి దూసుకెళ్లడంతో 8 మంది భక్తులు మృతి(8 Devotees Died)చెందారు.
జైపూర్ నుంచి యూపీలోని ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు టైరు పగిలిపోవడంతో అదుపు తప్పి రోడ్డుపై వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. దీంతో కారులోని ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారంతా కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రయాగ్ రాజ్ వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను సమీప ఆస్పత్రికి తరలించారు.
ప్రపంచంలోనే అతిపెద్ధ ఆధ్యాత్మిక కార్యక్రమంగా కొనసాగుతున్న మహాకుంభమేళా జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26వరకు కొనసాగనుంది. 144ఏళ్లకు ఒకసారి మాత్రమే వచ్చే మహాకుంభమేళా 45రోజుల పాటు కొనసాగుంది. మహాకుంభమేళాకు 45కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నారు.
ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఫిబ్రవరి 29వ తేదీ మౌని అమావాస్య రోజు వేకువజామున తొక్కిసలాట జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనలో మొత్తం 30 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా.. మరో 60 మంది తీవ్రంగా గాయపడినట్లు యూపీ సర్కారు వెల్లడించింది. మహాకుంభమేళాలో ఈ దఫా రెండుసార్లు అగ్నిప్రమాదాలు చోటుచేసుకోగా భక్తుల టెంట్లు కాలిపోయాయి.