- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Atishi: కేజ్రీవాల్ ను మళ్లీ సీఎంగా ఎన్నుకోవడమే నా లక్ష్యం.. అతిశీ కీలక వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ తన గురువు అని ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి అతిశీ అన్నారు. ఢిల్లీ సీఎంగా అతిశీని ఎంపిక చేసిన తర్వాత తొలిసారిగా ఆమె మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. కేజ్రీవాల్ పై తప్పుడు కేసులు పెట్టి ఆప్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆప్ అధినేతను మళ్లీ సీఎంగా ఎన్నుకోవడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. అతిశీ మాట్లాడుతూ.. 'ఢిల్లీకి ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఉన్నారు. అది అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే.. కేజ్రీవాల్‌ను తిరిగి ఢిల్లీ ముఖ్యమంత్రిగా తీసుకురావడమే లక్ష్యంగా రాబోయే రోజుల్లో పని చేస్తాను' అని అన్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వెంటనే ఓ రాష్ట్రానికి సీఎం కావడం ఆప్ లో మాత్రమే సాధ్యమని అన్నారు. "నేను వేరే పార్టీలో ఉండి ఉంటే, కనీసం నాకు ఎన్నికల టిక్కెట్ కూడా వఇచ్చేది కాదు. కానీ, అరవింద్ కేజ్రీవాల్ నన్ను నమ్మి ఎమ్మెల్యే, మంత్రిని చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు." అని అతిషి చెప్పారు.
కేజ్రీవాల్ మార్గదర్శకంలో పనిచేస్తా
తాను కేజ్రీవాల్ మార్గదర్శకత్వంలో పని చేస్తానని అతిషి చెప్పారు. ఢిల్లీ ప్రజలను రక్షించేందుకు, అరవింద్ కేజ్రీవాల్ మార్గదర్శకత్వంలో ప్రభుత్వాన్ని నడపడానికి ప్రయత్నిస్తానని ఆమె అన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌ను తిరిగి ఎన్నుకోకపోతే విద్య, వైద్యం, ఉచిత విద్యుత్ పథకాలు దెబ్బతింటాయని ఢిల్లీ ఓటర్లకు తెలుసు అని అన్నారు. ఇకపోతే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఆరు నెలలు మాత్రమే సమయం ఉంది. ఆప్ బీజేపీ దూకుడుని అడ్డుకోవడమే కాకుండా.. తిరిగి పుంజుకుంటున్న కాంగ్రెస్ ని కూడా ఎదుర్కోవలసి ఉంది. ఇకపోతే, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో జైలులో ఉన్న కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. ఆ తర్వాత సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో, ఆప్ ఎమ్మెల్యేలందరూ అతిశీని సీఎంగా ఎన్నుకున్నారు.