Alipur: అలీపూర్‌ అగ్ని ప్రమాదం.. రెండో రోజూ కొనసాగిన సహాయక చర్యలు

by vinod kumar |
Alipur: అలీపూర్‌ అగ్ని ప్రమాదం.. రెండో రోజూ కొనసాగిన సహాయక చర్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలోని అలీపూర్ (Alipur) ప్రాంతంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో శనివారం సాయంత్రం అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించిన విషయం తెలిసిందే. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు రెండో రోజూ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా సమీపంలోని గోదాములను ఖాళీ చేయించారు. మంటలను ఆర్పేందుకు 35 అగ్నిమాపక యంత్రాలు, 200 మంది సిబ్బందిని రంగంలోకి దింపారు. గోదాంలోని మూడు భవనాల్లో మంటలు చెలరేగగా అన్ని భవనాలు కూలిపోయాయయని చీఫ్ ఫైర్ ఆఫీసర్ రాజీవ్ శుక్లా(Rajeev Shukla) తెలిపారు.

ఈ ప్రాంతంలో నీటి సరఫరా సమస్య కారణంగా దాదాపు 500 మీటర్ల దూరం నుంచి నీటిని తెప్పిస్తున్నట్టు తెలిపారు. దీనివల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని చెప్పారు. గోదాం విస్తీర్ణం సుమారు 8000 చదరపు గజాల కంటే ఎక్కువగా ఉందని వెల్లడించారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలను ఇంకా నిర్ధారించలేదు. మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చిన తర్వాతే విచారణ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై సీఎం అతిశీ(Athishi) స్పందించారు. ఈ ఘటన ఆందోళన కలిగిస్తోందని తగిన ప్రభుత్వం తరఫున సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed