AICC: యువత దీనస్థితికి ఈ వీడియో చిన్న ఉదాహరణ.. ప్రియాంక గాంధీ ట్వీట్

by Ramesh Goud |   ( Updated:2025-01-14 12:21:36.0  )
AICC: యువత దీనస్థితికి ఈ వీడియో చిన్న ఉదాహరణ.. ప్రియాంక గాంధీ ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: దేశ యువత దీనస్థితికి ఈ వీడియో చిన్న ఉదాహరణ మాత్రమే అని ఏఐసీసీ అగ్రనేత(AICC Leader), ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi Vadra) స్పష్టం చేశారు. చత్తీస్‌గఢ్(Chattisgadh) లో ప్రభుత్వం ఉపాధ్యాయులను విధుల నుంచి తొలగించడం పట్ల బాధితులు నిరసన తెలుపుతూ నడి రోడ్డుపై సాష్టాంగ నమస్కారాలు చేశారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందిచిన ప్రియాంక గాంధీ.. బీజేపీ(BJP)పై తీవ్ర విమర్శలు చేశారు.

ఈ వీడియోపై ఆమె.. ఛత్తీస్‌గఢ్‌లోని ఈ వీడియో దేశ యువత దీనస్థితికి చిన్న ఉదాహరణ అని, రాష్ట్రంలో 33 వేల ఉపాధ్యాయ పోస్టులు(Teacher Posts) ఖాళీగా ఉన్నాయని, లక్ష ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం(BJP Government) 3 వేల మంది ఉపాధ్యాయులను తొలగించిందని తెలిపారు. ఈ తీవ్రమైన చలిలో రోడ్డుపై పడుకుని ఉద్యోగాలు ఇప్పించాలని వేడుకుంటూ ఈ బాలికలు నిరసన వ్యక్తం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక నేడు ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌ సహా ప్రతి రాష్ట్రానికి చెందిన యువత బీజేపీ అవినీతికి, నిరుద్యోగానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. బీజేపీ యావత్ దేశ యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిందని కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు చేశారు.

Next Story