Agniveer: అగ్నివీర్ సైనికులకు కేంద్రం తీపి కబురు.. త్వరలో ఆ ప్రకటన!

by Geesa Chandu |   ( Updated:2024-09-05 10:42:06.0  )
Agniveer: అగ్నివీర్ సైనికులకు కేంద్రం తీపి కబురు.. త్వరలో ఆ ప్రకటన!
X

దిశ, వెబ్ డెస్క్: అగ్నివీర్ సైనికులకు.. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు చెప్పనుంది. అగ్నివీరులను 4 సంవత్సరాల కాలం ముగిసిన తర్వాత సైన్యంలో కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, అగ్నివీర్ లో ప్రస్తుతానికి 25 శాతం మంది పనిచేస్తున్నారు. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

తాజాగా అగ్నిపథ్ కి సంబంధించిన స్కీమ్ లో.. కొన్ని మార్పులను చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ(defence ministry) వర్గాలను ఉటంకిస్తూ ఓ మీడియా నివేదికలో వెల్లడించింది.రక్షణ మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులను ఉటంకిస్తూ.. అగ్నిపథ్ స్కీమ్ లోని సేవల పరిమితులు పెంచడానికి చర్చలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ తరుణంలోనే 4 సంవత్సరాల సర్వీసును పూర్తి చేసుకున్న మరింతమంది అగ్నివీర్ సైన్యంలో కొనసాగనున్నట్లు తెలుస్తోంది. కాగా అగ్నిపథ్ స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం 2022 లో ప్రకటించింది.

Advertisement

Next Story