- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Agniveer: సైన్యంలో లక్ష మంది అగ్ని వీరులు..లెఫ్ట్‌నెంట్ జనరల్ పొన్నప్ప
దిశ, నేషనల్ బ్యూరో: ఇప్పటి వరకు లక్ష మంది అగ్నీ వీరులు ఆర్మీలో చేరారని, వారిలో 70,000 మంది వివిధ యూనిట్లలో విధుల్లో మోహరించినట్టు ఇండియన్ ఆర్మీ లెఫ్ట్‌నెంట్ జనరల్ జనరల్ చన్సీరా బన్సీ పొన్నప్ప వెల్లడించారు. ఇందులో 200 మంది మహిళలు కూడా ఉన్నట్టు తెలిపారు. 2024-25 ఏడాదికి గాను దాదాపు 50,000 ఖాళీలు రిలీజ్ అయ్యాయని వాటికి రిక్రూట్ మెంట్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. వారు జవాన్ల మాదిరిగానే అన్ని రకాల విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. ఒకే యూనిఫారం వేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అంతకుముందు సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నీనా సింగ్ మాట్లాడుతూ మాజీ అగ్నిమాపక సిబ్బంది రిక్రూట్‌మెంట్ కోసం ఫోర్స్ అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కానిస్టేబుల్ పోస్టుల్లో 10 శాతం రిజర్వ్ చేశామని, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నుంచి వారికి మినహాయింపు ఉంటుందన్నారు. వారికి వయసులో కూడా సడలింపు ఉంటుందని, మొదటి బ్యాచ్‌కు ఐదేళ్లు, తదుపరి బ్యాచ్‌లకు మూడేళ్లు సడలింపు ఉంటుందని వెల్లడించారు.