- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అదానీ ఫ్రంట్ మాత్రమే.. మోడీనే పెట్టుబడిదారి : కేజ్రివాల్

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు చేశారు. హిండెన్ బర్గ్ నివేదికపై విచారణ చేపడితే అదానీకి కాకుండా ప్రధానికే నష్టమని అన్నారు. అదానీ కేవలం ఒక ప్రంట్ మాత్రమేనని, మోడీనే పెట్టుబడిదారు అని ఆరోపించారు. మంగళవారం ఢిల్లీ అసెంబ్లీలో అదానీ వ్యవహారంపై కేజ్రివాల్ నిప్పులు చెరిగారు. ‘ప్రధాని నరేంద్ర మోడీ ఎవరికీ ఏమీ చేయలేదు. అలాంటప్పుడు అతను తన స్నేహితుడి పట్ల ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు? హిండెన్‌బర్గ్ నివేదికతో మోడీజీ అదానీని కాపాడే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇందులో రాజకీయ ప్రయోజనం కూడా ఉంది’ అని దుయ్యబట్టారు.
శ్రీలంకలో అదానీ గ్రూపుకు పవర్ ప్రాజెక్టు దక్కేలా ఒత్తిళ్లు తీసుకొని వచ్చారని కేజ్రివాల్ ఆరోపించారు. మోడీ శ్రీలంక ప్రాజెక్టును అదానీకి ఇచ్చేలా బలవంతం చేశారని.. అయితే సాంకేతికంగా ఇది ప్రధానికే చెందుతుందని విమర్శించారు. లంక పార్లమెంటులో రాజపక్సను ఇదే విషయమై ప్రశ్నించగా బలవంతంగా ఇచ్చినట్లు చెప్పారన్నారు. రెండేళ్ల క్రితం ఎయిర్ పోర్టులు ప్రైవేటే సంస్థలకు అప్పగించిన సమయంలో చివరి నిమిషంలో వేలంలో కొన్ని నిబంధనలు సడలించి, అదానీ గ్రూపునకు ఆరు ఎయిర్ పోర్టులు కేటాయించారని అన్నారు.