Kasturi Comments: వ్యాఖ్యలపై దుమారం.. క్లారిటీ ఇచ్చిన నటి

by Y.Nagarani |
Kasturi Comments: వ్యాఖ్యలపై దుమారం.. క్లారిటీ ఇచ్చిన నటి
X

దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య (Annamayya) సినిమాతో తెలుగులో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటి, బీజేపీ తమిళనాడు మహిళా నాయకురాలు కస్తూరి (Kasturi) చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇటీవల జరిగిన బీజేపీ (BJP)సమావేశంలో ప్రసంగించిన ఆమె.. ద్రావిడ సిద్ధాంత వాదుల గురించి మాట్లాడుతూ.. తెలుగువారిపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. రాజీలు, మహరాజుల కాలంలో తెలుగువారు.. అంతఃపురంలో మహిళలకు సేవకులుగా పనిచేసేందుకు తమిళనాడుకు వచ్చారని చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై తెలుగు రాజకీయనేతలు తీవ్రంగా స్పందించారు. ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

తాజాగా.. తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు కస్తూరి. తెలుగువారిని తాను అవమానించలేదని, తెలుగు తన మెట్టినిల్లని చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తెలుగువారంతా తన కుటుంబమని, తనపై ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తారన్నారు. తన వ్యాఖ్యల్ని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. తమిళ మీడియాలో తన కామెంట్స్ ను వక్రీకరిస్తూ వస్తున్న వార్తల్ని ఎవరూ నమ్మొద్దని కోరారామె. ముఖ్యంగా డీఎంకే (DMK) తన వ్యాఖ్యల్ని వక్రీకరిస్తుందని తెలిపారు. తాను తెలుగు వ్యతిరేకినని విషప్రచారం చేసి.. తనపై నెగిటివిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని వాపోయారు. హిందూత్వాన్ని నమ్మనివారు ఉన్నట్లుండి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan), రేవంత్ రెడ్డి (Revanth Reddy) వంటి తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతల్ని ట్యాగ్ చేస్తూ.. పోస్టులు పెట్టడం జోక్ గా ఉందన్నారు కస్తూరి. ఈ వివాదం ఇంకా ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed