Actor Vijay : నటుడు విజయ్‌కు వై కేటగిరీ భద్రత.. కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం

by vinod kumar |
Actor Vijay : నటుడు విజయ్‌కు వై కేటగిరీ భద్రత.. కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: సినీ నటుడు, తమిళగ వెట్రి కజగం (Tvk) చీఫ్ విజయ్‌కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వై కేటగిరీ భద్రత కల్పించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు ముప్పు పొంచి ఉందని ఇంటలిజెన్స్ (Intelligance) వర్గాల సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అయితే తమిళనాడు (Thamilnadu)లో మాత్రమే ఆయనకు భద్రత లభించనుంది. వై కేటగిరీ సెక్యురిటీలో 8 మంది ఉండనుండగా అందులో ఇద్దరు ఎన్ఎస్‌జీ కమాండోలు, మిగతా వారు పోలీసులు ఉంటారు. కాగా, గతేడాది విజయ్ టీవీకే పార్టీని స్థాపించారు. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆయన పని చేస్తున్నారు. తన పార్టీని బలోపేతం చేసేందుకు నిరంతరం సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవలే రాజకీయ వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్‌ (Prashanth Kishore) తోనూ సమావేశమయ్యారు. అయితే ఇటీవల ఇండియా టుడే, మూడ్ ఆఫ్ ది నేషన్ చేపట్టిన సర్వేలో రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విజయ్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు ఉంటాయని వెల్లడైంది. దీంతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా ఉత్కంఠ రేపాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ భద్రత కల్పించింది.

Next Story