- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీపై ప్రకాశ్ రాజ్ సెటైర్లు

X
దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. ట్యాక్స్ పేయర్లు కష్టపడి ప్రభుత్వానికి కడుతున్న డబ్బును దుర్వినియోగం కాకుండా చూస్తున్నామని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు సంధించారు.
‘‘విగ్రహాల నిర్మాణం, ప్రత్యేక విమానాల కొనుగోలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, విపక్ష ప్రభుత్వాలను కూలగొట్టడం కోసం రిసార్ట్ ఖర్చులు, ఫోటోగ్రఫీ, క్యాస్టూమ్, మేకప్, ఎన్నికల ప్రచారం.. ఇలా చాలా వాటికి ఖర్చు పెడుతూ మోడీ ప్రజా ధనాన్ని దుర్వినియోగం పరచడం లేదు’’ అంటూ ప్రకాశ్ రాజ్ ఎద్దేవా చేశారు.
Next Story