Abhishek Banerjee: 50 రోజుల్లోగా శిక్ష విధించే చట్టాలు రావాలి: అభిషేక్ బెనర్జీ

by vinod kumar |
Abhishek Banerjee: 50 రోజుల్లోగా శిక్ష విధించే చట్టాలు రావాలి: అభిషేక్ బెనర్జీ
X

దిశ, నేషనల్ బ్యూరో: లైంగిక దాడి కేసుల్లో 50 రోజుల్లోగా శిక్ష విధించేలా కఠిన చట్టాలు రావాలని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత అభిషేక్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. సమగ్ర అత్యాచార నిరోధక చట్టం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్రాలను కోరారు. ఈ మేరకు ఆయన గురువారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘దేశంలో రోజుకు 90.. ప్రతి గంటకు 4, ప్రతి 15 నిమిషాలకు ఒకటి చొప్పున లైంగిక దాడులు జరుగుతున్నాయి. కాబట్టి దీనిపై త్వరిగతిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఘటన జరిగిన 50 రోజుల్లోపు శిక్ష పడేలా చట్టాలు రావాలి. విచారణలు, నేరారోపణలను తప్పనిసరి చేసే బలమైన చట్టాలు అవసరం’ అని పేర్కొన్నారు. గత 10 రోజులుగా కోల్‌కతా ఘటనకు వ్యతిరేకంగా దేశం నిరసనలు తెలుపుతున్న క్రమంలోనే దేశంలోని వివిధ ప్రాంతాలలో 900 లైంగిక దాడులు జరిగినట్టు గుర్తు చేశారు. కేవలం వాగ్దానాలు మాత్రమే చేయకూడదని, న్యాయాన్ని నిర్ధారించే కఠిన చట్టం తీసుకురావాలని తెలిపారు. ఈ దిశగా ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed