- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ప్రధాని నరేంద్ర మోడీ ఇంట్లో కొత్త సభ్యుడు
దిశ వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోడీ ఇంట్లో ఓ కొత్త సభ్యుడు చేరాడు. తన కుటుంబంలోకి ఆ సభ్యుడి రాక పట్ల ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేసి, శాలువతో సన్మానించి పూజలు చేశారు. ఇంతకు ఆ సభ్యుడు ఎవరంటే అది ఓ అవు దూడ. ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో పెంచుకుంటున్న పుంగనూరు అవు ఓ దూడకు జన్మనిచ్చింది. ఆవు దూడ జననంతో తన నివాసంలోకి కొత్త సభ్యుడొచ్చాడంటూ ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. మోడీ ఆ దూడను దేవి విగ్రహం వద్దకు తీసుకెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించి శాలువా కప్పారు. నుదుటి మీద తెల్లటి రేఖతో పుట్టింది కాబట్టి దీప్ జ్యోతి అని పేరు పెట్టినట్లు ఆయన వెల్లడించారు. చిన్నారి ఆవు దూడను ఎత్తుకుని, ముద్దు చేస్తూ ఇంట్లో, నివాస ప్రాంగణంలో తిరుగుతూ ప్రధాని మురిసిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారింది. గోమాత సర్వసుఖ ప్రదాయినీ అనీ, లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధానమంత్రి ఇంటి కుటుంబంలోకి కొత్త సభ్యుడి రాక శుభప్రదమైనదని ఈ సందర్భంగా మోడి తన ట్వీట్ లో పేర్కోన్నారు.