- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రాష్ట్రంలో వింత ఘటన.. లేని శాఖకు 20 నెలలు పని చేసిన మంత్రి!

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. పంజాబ్‌లోని భగవంత్‌మాన్ ప్రభుత్వంలో డొల్లతనం బయటపడింది. రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఆప్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలకు దారితీసింది. అసలు ఉనికిలోనే లేని శాఖకు ప్రభుత్వం మంత్రిని నియమించడం షాక్‌కు గురిచేస్తోంది. ఆ శాఖకు ఆయన 20 నెలల పాటు హెడ్‌గా పనిచేయడం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశగా మారింది.
అసలు విషయంలోకి వెళితే.. సీఎం భగవంత్‌మన్(CM Bhagwantman) నేతృత్వంలోని పంజాబ్ కేబినెట్(Panjab Cabinet) లో ధలివాల్ సీనియర్ మోస్ట్ మంత్రుల్లో ఒకరు. కుల్దీప్ సింగ్ ధలివాల్(Kuldeep Singh Dhaliwal).. 20 నెలల పాటు ఉనికిలో లేని పరిపాలనా సంస్కరణల విభాగానికి నేతృత్వం వహించారు. పంజాబ్ ప్రభుత్వం(Punjab Government) ఇటీవలే ఆయన శాఖను పునర్వ్యవస్థీకరించారు.
2025 ఫిబ్రవరి 21న పంజాబ్ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్ర మంత్రి కుల్దీప్ సింగ్ ధలివాల్ NRI వ్యవహారాల శాఖను మాత్రమే నిర్వహిస్తారు. గతంలో ధలివాల్‌కు కేటాయించిన పరిపాలనా సంస్కరణల శాఖ ఉనికిలో లేదు. అసలు ఈ పరిపాలనా సంస్కరణల శాఖకు సిబ్బందిని కేటాయించలేదు. 20 నెలలుగా సమావేశాలు జరగలేదు. కానీ ధలివాల్ మాత్రం మంత్రిగా కొనసాగారు. ఈ విషయం పై బీజేపీ(BJP) తీవ్ర విమర్శలు చేసింది. పంజాబ్‌లో పాలనను ఆప్ ఒక జోక్‌గా మార్చిందంటూ మండిపడ్డారు.