వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు.. రాచకొండ షీ టీమ్స్ స్ట్రాంగ్ వార్నింగ్

by Ramesh Goud |
వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు.. రాచకొండ షీ టీమ్స్ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: నగరంలోని పోకిరిలకు రాచకొండ షీ టీమ్స్ (Rachakonda SHE Temas) స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. బాలికలు, మహిళలను వేధించే వారికి కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. బస్టాండ్లు, మెట్రో, రైల్వే స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, మార్కెట్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో మఫ్టీలో షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్లు (SHE Teams Decoy Operations) చేస్తున్న విషయం తెలిసిందే. బాలికలు, మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న వారిని సాక్ష్యాలతో సహా అరెస్ట్ చేసి, తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం రాచకొండ క్యాంప్ కార్యాలయం (Rachakonda Camp Office)లో 203 మంది (మేజర్స్ - 138, మైనర్స్ - 65) ఈవ్‌టీజర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు.

మార్చి 1 నుంచి 31 వరకు ఫోన్ ద్వారా వేదించినవి 30 కేసులు, సోషల్ మీడియా యాప్స్ ద్వారా వేదించినవి 87 కేసులు, నేరుగా వేదించినవి 132 కేసులు మొత్తంగా కలిపి 249 ఫిర్యాదులు అందాయని. ప్రతీ ఫిర్యాదుపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో 14 మందిపై క్రిమినల్ కేసులు, 84 మందిపై పెట్టి కేసులు, 116 మందికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని వుమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ టీ. ఉషారాణి (Women Sefety Wing DCP T.Usharani) తెలిపారు. ఇక బాలికలు, మహిళలను వేధించే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని రాచకొండ సీపీ జి. సుధీర్ బాబు (Rachakonda CP Sudheer Babu) తెలిపారు. మహిళలు భయపడకుండా ఫిర్యాదు చేయాలని సీపీ సూచించారు.



Next Story

Most Viewed