- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ ఫేమస్ కేఫ్‌లో రష్యన్ సలాడ్ బంద్?!
దిశ, వెబ్‌డెస్క్ః ఉక్రెయిన్‌పై రష్యా దాడులు పెంచుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. అనేక ప్రయివేటు సంస్థలు కూడా తమదైన శైలిలో యుద్ధంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. యూరప్, యూఎస్‌లలో కొన్ని సూపర్ మార్కెట్లు రష్యన్ ఆహార పదార్థాలను విక్రయించట్లేదు. ఇక, అంతర్జాతీయ వేదికలపై భారతదేశం రష్యాను ప్రత్యక్షంగా వ్యతిరేకించనప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇండియాలో వ్యతిరేకత ప్రతిబింబిస్తోంది. ఈ క్రమంలోనే సమాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ వెళ్లగలిగిన, వెళ్లే కేరళలోని ఒక కేఫ్ ఇప్పుడు రష్యన్ సలాడ్‌ను టేబుల్ నుండి తీసివేస్తున్నట్లు ప్రకటించింది.
"ఉక్రెయిన్ ప్రజలకు సంఘీభావంగా, మేము మా మెనూ నుండి 'రష్యన్ సలాడ్'ని తీసేసాము" అని కేరళలోని, ఫోర్ట్ కొచ్చిలో ఫేమస్ అయిన "కాశీ ఆర్ట్ కేఫ్ & గ్యాలరీ" బయట ఓ బోర్డు పెట్టారు. దీని ఫోటో ఇంటర్‌నెట్‌లో పోస్ట్ చేసినప్పటి నుండి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. దీనిపై కేఫ్ యజమాని ఎడ్గార్ పింటో మాట్లాడుతూ, "అమాయక ప్రజలపై రష్యా చేస్తున్న క్రూరమైన దాడులను ఖండిచే క్రమంలో మేము ఈ నిర్ణయం తీసుకున్నామని" అన్నారు. అయితే, తాము తీసుకున్న ఈ నిర్ణయం సోషల్ మీడియాలో ఇంత వైరల్ అవుతుందని ఊహించలేదని అన్నాడు. కానీ, "మేము ఇది ప్రచారం చేయట్లేదు. మేము యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నామంతే. కళా ప్రేమికులుగా, మేము భావప్రకటనా స్వేచ్ఛను విశ్వసిస్తాము. ఉక్రెయిన్‌లోని ప్రజలకు మా మద్దతు ఇవ్వడానికి ఇది ఒక మార్గం అనుకున్నామంతే. కానీ మేము రష్యా ప్రజల్ని ద్వేషించట్లేదు" అని పింటో స్పష్టం చేశారు.