ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం హోలీ కానుక.. ఈ వారంలోనే డీఏ పెంపు ప్రకటన!

by Mahesh Kanagandla |
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం హోలీ కానుక.. ఈ వారంలోనే డీఏ పెంపు ప్రకటన!
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం హోలీ(Holi)కి ముందు బంపరాఫర్ ప్రకటించనున్నట్టు తెలుస్తు్న్నది. 7th Pay Commission లో భాగంగా డీఏ(DA), డీఆర్‌(DR)లపై రెండు శాతం పెంపు ఉండే అవకాశముంది. ఈ నిర్ణయంతో సుమారు 1.2 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ప్రయోజనం లభించనుంది. 2 శాతం పెంపుతో మొత్తంగా కనీస వేతనంపై డీఏ, డీఆర్‌లు 53 నుంచి 55 శాతానికి పెరగనున్నాయి. ప్రతి బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశమవుతుందని తెలిసిందే. ఈ బుధవారం ప్రధాని మోడీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ భేటీలో డీఏ, డీఆర్ పెంపుపై నిర్ణయం ఉండొచ్చని తెలుస్తున్నది. కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ అధ్యక్షుడు రూపక్ సర్కార్ కూడా ఈ భేటీలోనే నిర్ణయం జరిగే అవకాశముందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ అందిస్తారని తెలిసిందే. 8వ పే కమిషన్ వేస్తామని ఈ జనవరిలోనే కేంద్రం వెల్లడించింది. త్వరలోనే 8వ పే కమిషన్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసే అవకాశముంది.

Advertisement
Next Story

Most Viewed