ఒక్క జూలైలోనే 72 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధం

by Mahesh |   ( Updated:2023-09-05 07:25:52.0  )
ఒక్క జూలైలోనే 72 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధం
X

దిశ, వెబ్‌డెస్క్: మెటా యాజమాన్యంలోని వాట్సాప్ 2021 కొత్త ఐటీ రూల్స్‌కు లోబడి జూలై నెలలో భారతదేశంలో దాదాపు 72 లక్షలకు పైగా వాట్సాప్ ఖాతాలను నిషేధించినట్లు ప్రకటించింది. జూలై 1-31 మధ్య “72,28,000 వాట్సాప్ ఖాతాలు నిషేధించబడ్డాయి. వీటిలో 31,08,000 ఖాతాలు ముందుగా నిషేధించబడ్డాయి. వినియోగదారుల నుండి ఎటువంటి నివేదికలు రాకముందే WhatsApp దాని నెలవారీ నివేదికలో ఈ డాటాని పేర్కొంది. దేశంలో 500 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న వాట్సాప్ జూలైలో 11,067 ఫిర్యాదు నివేదికలను అందుకుంది. వీటి ఆధారంగా కొన్నింటికి పరిష్కారం చూపగా మరికొన్నింటిని రికార్డు చేసుకున్నట్లు ప్రకటించింది.

Advertisement

Next Story