- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Accident: కుంభమేళా నుంచి తిరిగివస్తూ అనంతలోకాలకు..

దిశ, నేషనల్ బ్యూరో: మహా కుంభమేళా (Kumbh Mela) నుంచి తిరిగివస్తున్న యాత్రికులకు ఘోర ప్రమాదం జరిగింది. కుంభమేళా నుంచి తిరిగి వస్తున్న భక్తుల మినీ బస్సుని లారీ ఢీకొట్టింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌లో జరిగిన ఈ ఘటన (Road Accident)లో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. జబల్‌పుర్‌లోని సిహోరా సమీపంలో మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సిమెంట్ లోడ్‌తో వెళ్తోన్న లారీ హైవే పైకి రాంగ్ రూట్‌లో రావడంతోనే యాక్సిడెంట్ జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా.. మినీ బస్సులో చిక్కుకున్న మరికొందరు యాత్రికులను స్థానికులు కాపాడి బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో మినీ బస్సులో 14 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడినవారిని సిహోరా ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రమాదానికి గురైన వాహనం నంబర్ ని బట్టి మృతులు ఆంధ్రప్రదేశ్ వాసులని అధికారులు భావించారు. కానీ, తర్వాత మృతదేహాల వద్ద దొరికిన ఆధారాలతో మృతులను హైదరాబాద్ వాసులుగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.
మరో ప్రమాదం
మంగళవారం ఒక్కరోజే మూడు ప్రమాదాలు జరిగాయి. ఉత్తరప్రదేశ్ లో ఇద్దరు, బిహార్ లో ముగ్గురు చనిపోయారు. కుంభమేళా నుంచి తిరిగి వస్తున్న యాత్రికులే చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ లోని మైహార్ లోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది. కుంభమేళా నుంచి తిరిగివస్తున్న వెహికిల్ ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు చనిపోయారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. మైహార్ లోని కాంచన్ పూర్ గ్రామం వద్ద ప్రమాదం జరిగినట్లు నాదన్ దేహత్ పోలీసులు తెలిపారు. మహాకుంభమేళా నుంచి మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యిందన్నారు. గాయపడిన వారందరినీ సత్నా జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తిస్తామని అధికారులు వెల్లడించారు. కుంభమేళా నుంచి బిహార్ తిరిగివస్తున్న మరో ముగ్గురు ప్రమాదంలో చనిపోయారు. కైమూర్ జిల్లాలోని ముతాని ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజాముని యాక్సిడెంట్ జరిగింది. ట్రక్కు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. మృతులంతా కుంభమేళా నుంచి తిరిగివస్తున్నట్లు సమాచారం.