ఫేక్ వీసా రాకెట్ నడుపుతున్న ఇద్దరు అరెస్ట్

by John Kora |   ( Updated:2025-01-30 18:15:35.0  )
ఫేక్ వీసా రాకెట్ నడుపుతున్న ఇద్దరు అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఫేక్ వీసాల రాకెట్ నడుపుతున్న ఇద్దరిని గురువారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన సౌరవ్ కుమార్, సుమిత్ కుమార్‌లు ఫేక్ వీసాలతో పోలాండ్ వెళ్లడానికి ప్రయత్నించగా దుబాయ్‌లో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పోలాండ్ వెళ్లడానికి పత్రాలను సమర్పించగా.. అనుమానంతో దుబాయ్ అధికారులు తనిఖీ చేశారు. అవి నకిలీవి అని తేలడంతో దుబాయ్ నుంచి వారిని తిరిగి ఢిల్లీకి పంపారు. కాగా, సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా ఉదయ్ పాల్ సింగ్ (42), తేజీందర్ (51)లు తమకు వీసాలు అరేంజ్ చేసినట్లు చెప్పారు. ట్రావెల్ ఏజెంట్లుగా పని చేస్తున్న వారిద్దరూ పలువురికి నకిలీ వీసాలు ఇప్పించి, విదేశాలకు పంపించినట్లు తెలిసింది. ఉదయ్ పాల్ 2024లో కూడా ఇలాంటి నకిలీ వీసా ఘనటలో అరెస్టు అయినట్లు తెలిసింది. తనకు చెందిన ప్రింటింగ్ కంపెనీలోనే ఈ నకిలీ వీసాలను తయారు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. కాగా, వీరిద్దరూ ఒక్కొక్కరి దగ్గర రూ.10 లక్షలు తీసుకొని పోలాండ్ వీసాలను సృష్టించినట్లు తెలిసింది.


Next Story

Most Viewed