Manipur : 11 మంది కుకీ మిలిటెంట్లు హతం.. మణిపూర్‌‌లో ఎన్‌కౌంటర్

by Hajipasha |   ( Updated:2024-11-11 12:24:22.0  )
Manipur : 11 మంది కుకీ మిలిటెంట్లు హతం.. మణిపూర్‌‌లో ఎన్‌కౌంటర్
X

దిశ, నేషనల్ బ్యూరో : మణిపూర్‌(Manipur)లో కుకీ వర్గం మిలిటెంట్లు(Kuki militants) ఘాతుకానికి తెగబడ్డారు. జిరిబామ్ జిల్లాలోని సెంట్రల్ రిజర్వ్‌ పోలీస్ ఫోర్స్ (CRPF) క్యాంపుపై సోమవారం దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ క్యాంపులోని సీఆర్‌పీఎఫ్, అస్సాం రైఫిల్స్ బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. మిలిటెంట్లను బలంగా తిప్పికొట్టాయి. కాల్పుల మోతతో కొన్ని గంటల పాటు సీఆర్‌పీఎఫ్ క్యాంపు ఏరియా దద్దరిల్లింది. సీఆర్‌పీఎఫ్ బలగాల ఆపరేషన్‌లో దాదాపు 11 మంది కుకీ మిలిటెంట్లు హతమయ్యారు. ఒక సీఆర్‌పీఎఫ్ జవాన్‌కు గాయాలు కావడంతో వెంటనే హెలికాప్టర్‌లో సమీపంలోని ఆస్పత్రికి పంపించారు.

పొలంలోని రైతులపైకి కాల్పులు.. ఒకరికి గాయాలు

గత కొన్ని వారాలుగా మెయితీ వర్గానికి చెందిన రైతులు, వ్యవసాయ కూలీలను లక్ష్యంగా చేసుకొని కుకీ మిలిటెంట్లు దాడులకు దిగుతున్నారు. తాజాగా సోమవారం ఉదయం ఇంఫాల్ తూర్పు జిల్లాలోని ఓ ఊరిలో ఉన్న పొలంలో పనిచేస్తున్న రైతులపై సాయుధ దుండగులు కాల్పులు జరిపారు. ఆ పొలాల పక్కనే ఉన్న కొండపై నుంచి ఫైరింగ్ చేశారని గుర్తించారు. భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని ప్రతికాల్పులు జరపడంతో మిలిటెంట్లు వెనక్కి తగ్గారు. ఒక రైతుకు గాయాలు కావడంతో సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. గత శనివారం రోజు బిష్ణుపూర్ జిల్లాలో ఇదే విధంగా మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో 34 ఏళ్ల మహిళా రైతు చనిపోయింది.

Advertisement

Next Story

Most Viewed