- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బొమ్మల తయారీలో స్వయం సమృద్ధత సాధించాలి: మోడీ
న్యూఢిల్లీ: బొమ్మల తయారీలో భారత్ స్వయం సమృద్ధతను సాధించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. పర్యావరణాన్ని, మానసిక స్థితిని సంతులనం చేసేలా ఈ బొమ్మలుండాలని సూచించారు. దేశంలోనే తొలి బొమ్మల మేళాను ప్రధానమంత్రి మోడీ శనివారం ప్రారంభించారు. ఈ బొమ్మల ప్లాస్టిక్ స్వల్పంగా వినియోగించాలని, పునర్వినియోగించే పదార్థాలనూ ఎన్నుకోవాలని సూచించారు. ‘మనదేశంలో తయారైన బొమ్మలు భారతీయుల జీవన శైలిని ప్రతిబింబిస్తాయి. వస్తువులను పునర్వినియోగించే సంప్రదాయం ఇక్కడ ప్రబలంగా ఉంటుంది. ఇదే సంస్కృతి మన బొమ్మలను కనిపిస్తుంది’ అని పేర్కొన్నారు. ఈ మేళాను వర్చువల్ కాన్ఫరన్స్‌లో ప్రారంభించి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన క్లస్టర్లతో సంభాషించారు. భారత బొమ్మల తయారీ పరిశ్రమను మరింత వృద్ధి చేయాలని, కర్ణాటకలోని టాయ్ క్లస్టర్ చన్నపట్నానికి చెందిన విభాగాన్ని కోరారు. చన్నపట్న దాదాపు 200 ఏళ్లుగా బొమ్మలను తయారుచేస్తున్నది.