జగన్‌కి ఆందోళన లేదు..అధికార దాహమే: లోకేశ్

by srinivas |
జగన్‌కి ఆందోళన లేదు..అధికార దాహమే: లోకేశ్
X

వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కరోనా వ్యాప్తిపై ఆందోళన లేదని, అధికార దాహమే ఉందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ట్విట్టర్ మాధ్యమంగా జగన్‌పై విమర్శలు చేస్తూ, కోవిడ్ 19 వ్యాప్తిని నిరోధించేందుకు జగన్‌ ఎటువంటి చర్యలూ తీసుకోవట్లేదని అన్నారు. జగన్‌కు రాష్ట్ర ప్రజలను రక్షించాలన్న బాధ్యత లేదని విమర్శించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పాఠశాలలను మూసేస్తున్నాయని, జనాలు గూమికూడకుండా చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. అయితే, ఏపీలో మాత్రం పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉందని, ప్రజారక్షణకు ఏ విధమైన చర్యలు చేపట్టడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి జగన్‌ ఇగోయే కారణమని ఆయన విమర్శించారు.

tags : tdp, nara lokesh, ysrcp, jagan, kovid-19, carona virus, twitter

Next Story

Most Viewed