- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జేఈఈ మెయిన్స్‌లో సత్తా చాటిన తెలంగాణ తేజం

దిశ, పాలేరు: ఆలిండియా స్థాయిలో నిర్వహించిన జేఈఈ పరీక్షల్లో 99.997 పర్సెంటేజ్‌తో ఎస్సీ కేటగిరిలో జాతీయ స్థాయిలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువుమాధవరం గ్రామానికి చెందిన నందిగామ నిఖిల్ మొదటి స్థానాన్ని సాధించాడు. అత్యుత్తమ ప్రతిభతో జాతీయస్థాయిలో ఈ ఘనతను సాధించారు. చిన్నతనం నుండి చదువు పట్ల ఆసక్తి కనపరచేవాడని సమాచారం. శనివారం ప్రకటించిన ఫలితాల్లో జాతీయ స్థాయి ర్యాక్ రావటంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. వృత్తి రీత్యా తల్లిదండ్రులు ఆనంద్, రాణి ఇద్దరు ఉపాధ్యాయులు కావటం నిఖిల్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బాల్యం నుండే చదువుల్లో ముందుండేలా ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ.. లక్ష్య సాధన కోసం ప్రణాళికా బద్ధంగా చదివితే తప్పకుండా విజయం వరిస్తోందని అన్నారు. నాకు సహకరించిన నా ఉపాధ్యాయులకు, శ్రేయోభిలాషుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నేను సాధించిన ఈ విజయం నా తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నానన్నారు. ఇంకా జీవితంలో మరెన్నో విజయాలు సాధించాలని మీ అందరి దీవెనలు కావాలని కోరుకున్నారు. కాగా, తండ్రి ఆనంద్ చెర్వుమాధారంలో, తల్లి రాణి గోల్ తండాలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.