- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలయ్య సంచలన వ్యాఖ్యలు : భారతరత్న చెప్పుతో సమానం.. కాలిగోటికి కూడా
దిశ, వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ కోపం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా ఏదో ఒక సంచలాన్ని సృష్టించి కానీ వెళ్ళరు. ఇలా చాలాసార్లు మీడియా ముందు నోరుజారి వివాదాల్లో ఇరుక్కున్నారు. ఇక మరోసారి బాలకృష్ణ నోరుజారారు. దేశం గర్వించదగ్గ అవార్డులను పూచిక పుల్లతో తీసిపారేసారు. భారతరత్న చెప్పుతో సమానమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే.. బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369’ సినిమా విడుదలై 30 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
దేశంలో అత్యున్నత పురస్కారంగా చెప్పే భారతరత్నను దివంగత మహానటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుకు ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తున్నదే. ఇక బాలయ్య ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని యాంకర్ ప్రస్తావించగా.. ఆయన ఆవేశానికి గురయ్యారు.” ఏం అవార్డులు వచ్చాయని ఆయన మహనీయుడు అయ్యారు. భారతరత్న రాకపోవటం వల్ల ఆయన కీర్తికి ఎలాంటి భంగం వాటిల్లదు. ఎన్టీఆర్ కు భారతరత్న కాలిగోటితో సమానం. ఆ అవార్డు చెప్పుతో సమానం. ఆయనకు అవార్డు ఇస్తే ఆ గౌరవం ఆయనకు రాదు.. ఇచ్చిన వారికి వస్తుంది” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. దేశ అత్యున్నత పురస్కారాన్ని బాలయ్య బాబు కించపరిచారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం బాలయ్య బాబు గురించి తెలిసిందే కదా.. ఏదో ఒకటి అనకపోతే ఆయనకు నిద్రపట్టదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య ‘అఖండ’ చిత్రంలో నటిస్తున్నారు.