- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కాయ్ రాజా కాయ్’.. సాగర్‌లో గెలిచేది మేమే..!
దిశ, హాలియా: నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. 88% శాతం పోలింగ్ నమోదైన సంగతి కూడా తెలిసిందే. ప్రస్తుతం ఎమ్మెల్యే పదవి కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ప్రచారహోరులో ఎవరి బలం వారు నిరూపించుకున్నా.. నియోజకవర్గ ప్రజలు ఎటువైపు ఉన్నారు చర్చనీయాంశం అయింది.
ఈ నేపథ్యంలోనే రాజకీయ నిపుణులు, పలు సంస్థల చేత సర్వేలు కూడా ఎవరికి వారు చేయించుకుని, మేమే గెలుస్తామంటే మేమే గెలుస్తాం అనే ధీమాలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉన్నాట్టు సమాచారం. ఎవరి ధీమా వారిదే అయినా తుది ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే ఉపపోరులో కారు స్పీడ్‌కు బ్రేక్‌లు పడేనా ! హస్తం ఆశలు చిగురించేనా ? అనే సందేహం నియోజకవర్గంలోనే కాకుండా.. రాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చనీయాంశం అయింది.
సాగర్ ఫలితంపై కాయ్ రాజా కాయ్..
ఓ వైపు సాగర్ ఉపఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన తరుణంలో కొంతమంది బెట్టింగ్‌లకు దిగుతున్నారు. వేలు, లక్షల్లో గెలుపు గుర్రాలపై పందాలు కాస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనికితోడు కార్యకర్తలంతా పైకి ఓ పార్టీ తరఫున ప్రచారం చేసినా.. చాపకింద నీరులా మరొక పార్టీకి ఓటు వేసినట్టు నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. ఈ చర్చలను మాత్రం పెడ చెవిన పెడుతున్న ప్రధాన పార్టీలు(టీఆర్ఎస్-కాంగ్రెస్) ఎవరి గెలుపుపై వారు ధీమాతో ఉండటం విశేషం. ఇక ఈ ఉత్కంఠకు తెరపడాలంటే మే 2వ తేది వరకు వేచిచూడాల్సిందే.