‘నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే కౌంటింగ్‌కు’

by Shyam |   ( Updated:2021-05-01 08:17:20.0  )
‘నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే కౌంటింగ్‌కు’
X

దిశ,హలియా: నాగార్జునసాగర్ ఉపఎన్నిక కౌంటింగ్ సర్వం సిద్ధమైంది. కౌంటింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిడమానూరు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో గత మూడు రోజులుగా ఉప ఎన్నికల కౌంటింగ్‌లో పాల్గొనే వారందరికీ కరోనా టెస్టులు చేశారు. మొదటి రోజు వివిధ పార్టీల పోలింగ్ ఏజెంట్లకు, రాజకీయ నాయకులకు, రెండో రోజు కౌంటింగ్ సూపర్‌వైజర్లకు, 20 మంది అసిస్టెంట్లు, 40 మంది మైక్రో అబ్జర్వర్లు, 20 పోలీస్ సిబ్బంది, పోలింగ్ సిబ్బందికి, మూడో రోజు శనివారం మీడియా వాళ్ళకి కొవిడ్ టెస్ట్‌లు నిర్వహించారు. మొదటి, రెండవ రోజులలో కరోనా టెస్టులు చేసినవారికి శనివారం నెగెటివ్ పత్రాలు అందజేశారు. కౌంటింగ్ హాజరయ్యే వారందరూ నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే కౌంటింగ్‌ హాల్‌లోకి అనుమతించబడుతారని ఎన్నికల అధికారి రోహిత్ సింగ్ తెలిపారు.

Advertisement

Next Story