వాళ్లు తక్కువ బరువుండటానికి వీళ్లేదు : కలెక్టర్

by Shyam |   ( Updated:2021-11-06 06:07:00.0  )
Nagar Kurnool Collector Uday Kumar
X

దిశ, అచ్చంపేట: నల్లమల ఏజెన్సీ ప్రాంతంలో జీవిస్తున్న చిన్నారులు ఏ ఒక్కరూ కూడా పౌష్టికాహార లోపంతో కనిపించకూడదని కలెక్టర్ ఉదయ్ కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శనివారం అమ్రాబాద్ మండల పరిధిలోని మన్ననూర్ పీఓ ఐడీడీఏ కార్యాలయంలో స్యామ్ మ్యామ్ పిల్లలను సాధారణ స్థితికి తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఐటీడీఏ అధికారి, సీడీపీఓలు, సూపర్వైజర్‌లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో తక్కువ బరువుతో ఉన్న పిల్లలను గుర్తించి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెంచు గూడాలు, ఏజెన్సీ ఏరియాల్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా ఇచ్చే పౌష్టికాహారంతో పాటుగా గిరి పోషణ్ అభియాన్ కింద అదనంగా పౌష్టికాహారం అందజేయడం జరుగుతోందన్నారు. ఇకనుంచి ఏజెన్సీలో ఏ ఒక్క చిన్నారీ తక్కువ బరువుతో ఉండటానికి వీళ్లేదని అన్నారు.

స్యామ్ మ్యామ్ పిల్లలకు పౌష్టికాహారం సరైన సమయంలో తినిపించే బాధ్యత అంగన్వాడీ టీచర్లు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల తీరు బాగోలేదని, పద్దతి మార్చుకోవాలని, తిరిగి మరో నాలుగు రోజుల్లో మరో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేస్తానని సూచించారు. అన్ని అంగన్వాడీ సెంటర్ల వద్ద మునగ చెట్లు పెట్టించాలని, వాటి ఆకులు, కాయలు పిల్లలకు ఉపయోగపడతాయని సూచించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట డీఆర్ఓ పాండు నాయక్, పీఓ అశోక్, సీడీపీఓలు, అంగన్వాడీ సూపర్వైజర్‌లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed