నాగర్‌ కర్నూల్ వాసికి ఇంటర్నేషనల్ బెస్ట్ ఫోటోగ్రాఫర్ అవార్డు

by Shyam |
నాగర్‌ కర్నూల్ వాసికి ఇంటర్నేషనల్ బెస్ట్ ఫోటోగ్రాఫర్ అవార్డు
X

దిశ, నాగర్‌కర్నూల్ : ఫోటోగ్రఫీ సొసైటీ ఆఫ్ అమెరికా, సిగ్మా ఆర్ట్ అకాడమీ, హైదరాబాద్ వారు సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ల పోటీలలో నాగర్ కర్నూల్ జిల్లా కందనూల్‌కు చెందిన అశోక్ కుమార్ మహిళా ఫోటో విభాగంలో ఉత్తమ అంతర్జాతీయ చిత్రకార బహుమతికి ఎంపికయ్యారు. ఆదివారం ఉదయం ఈ ఫలితాలు వెల్లడయ్యాయి.

మొత్తంగా ఆయా ప్రాంతాల్లో తీసిన 16 ఫోటోలను ప్రదర్శించగా అరకు వద్ద మహిళలు నీటి బిందెలను ఎత్తుకొని వెళుతున్న సమయంలో క్లిక్ మనిపించిన ఫొటోకు ఈ అవార్డు దక్కింది. అయితే, ప్రైజ్ మనీ కింద ప్రశంస పత్రం, నగదును అందుకున్నట్టు అశోక్ తెలిపారు. ఈ పోటీలో 350 మంది ఫొటోగ్రాఫర్లు 43 దేశాల నుండి పాల్గొన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story