- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫార్మాట్ బట్టి స్థానం మారినా పర్వాలేదు : కేఎల్ రాహుల్
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియాలో కీలక సభ్యుడిగా మారిన కేఎల్ రాహల్ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. నవంబర్ 27 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా.. రోహిత్ గౌర్హాజరీలో శిఖర్ ధావన్‌కు తోడుగా ఎవరు ఓపెనర్‌గా వస్తారనే దానిపై సందిగ్ధత నెలకొన్నది. గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తూ, ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ కూడా సొంతం చేసుకున్న కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా వస్తారని భావించినా.. అతడిని నాలుగో స్థానంలో ఆడించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నది. దీనిపై కేఎల్ రాహుల్ ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ… ‘ఫార్మాట్‌ను బట్టి నా బ్యాటింగ్ ఆర్డర్ మార్చినా నాకు పర్వాలేదు. న్యూజీలాండ్ పర్యటనలో ఐదో స్థానంలో ఆడాను.. కొన్నాళ్లు ఓపెనింగ్ కూడా చేశాను. ఇప్పుడు నాలుగో స్థానంలో ఆడమన్నా ఆడతాను. ఏ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగినా జట్టు ప్రయోజనాలే నాకు ముఖ్యం. టీమ్ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను’ అని చెప్పాడు.