మస్తు తిట్టుకున్న కాంగ్రెస్ నేతలు.. కొట్టుకోవడం ఒక్కటే తక్కువ..

by Shyam |   ( Updated:2021-03-27 06:13:08.0  )
మస్తు తిట్టుకున్న కాంగ్రెస్ నేతలు.. కొట్టుకోవడం ఒక్కటే తక్కువ..
X

దిశ, మెదక్ : ఫ్లెక్సీల్లో ఫోటోలు లేకపోవడంతో కాంగ్రెస్ నాయకులు పరస్పరం దూషించుకున్న ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. టీపీసీసీ అధికార ప్రతినిధి ఆవుల రాజిరెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో స్థానిక నాయకుల ఫోటోలు లేకపోవడంతో ఒకరిపై ఒకరు పరస్పరం దూషించుకున్నారు.

ఆవుల రాజిరెడ్డి ప్లెక్సీలో స్థానిక నేతలు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు మల్లేశం, ఎంపీపీ అధ్యక్షురాలు భర్త సురేష్ నాయక్,నాయకులుఆంజనేయులు గౌడ్, రిజ్వాన్ తదితరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలో తమ ఫోటోలు లేవని ఒకరిపై ఒకరు పరస్పరం తిట్టుకున్నారు. స్థానిక నాయకులకు సమాచారం ఇవ్వకుండా పార్టీ కార్యక్రమాలు ఎలా ఏర్పాటు చేసారని టీపీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డితో వాగ్వాదని దిగారు. దీంతో పార్టీ నాయకులు జ్యోక్యం చేసుకొని ఇరువురికి నచ్చచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

Advertisement

Next Story