- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మద్యం షాపులో మాటమాట కలిపి నిర్మానుష్య ప్రాంతంలో..
దిశ, కామారెడ్డి : వెండి కడియాల కోసం ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశాడో కిరాతకుడు. మద్యం షాపులో మాటమాట కలిసి మర్డర్ చేసి పరారీ అయ్యాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి శవంగా కనిపించడంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్నారు. కామారెడ్డి డీఎస్పీ సోమనాథం తెలిపిన వివరాల ప్రకారం..
రామారెడ్డి మండలం రెడ్డిపేట జగదాంబ తండాకు చెందిన భూక్య మోతీరాం ఈనెల 6న ఇంటినుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కామారెడ్డి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 6న కామారెడ్డికి వచ్చిన మోతీరాం వైన్స్ వద్ద మద్యం తీసుకుంటుండగా గాంధారికి చెందిన బండారి రాజేష్ మాట మాట కలిపాడు. అక్కడినుంచి కల్లు దుకాణానికి తీసుకువెళ్లి ఫుల్లుగా తాగించాడు. అనంతరం రామేశ్వర్ పల్లి శివారులోని కుంట వద్దకు తీసుకెళ్లి తాగిన మైకంలో ఉన్న మోతీరాం గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మోతీరాం ఒంటిపై ఉన్న 80 తులాల నాలుగు వెండి కడియాలు, 25 వేల నగదు తీసుకుని మోతీరాంను కుంటలో తోసేసి అక్కడినుంచి వెళ్లిపోయాడు.
వెండి కడియాలను చాకలి కృష్ణ అనే వ్యక్తి వద్ద ఉంచాడు. రాజేష్‌కు గూడ రాజేష్, చాకలి కృష్ణ ఇద్దరు సహకరించారు. గురువారం బండారు రాజేష్‌తో పాటు అతనికి సహకరించిన రాజేష్, కృష్ణలను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ సోమనాథం తెలిపారు. నిందితుల నుంచి నాలుగు వెండి కడియాలు, రూ.25 వేల నగదు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అపరిచిత వ్యక్తులను నమ్మవద్దని, అలాంటి వారు కనపడితే పోలీసులకు తెలియజేయాలని డీఎస్పీ కోరారు. ఈ సమావేశంలో కామారెడ్డి పట్టణ ఎస్.హెచ్.ఓ మధుసూదన్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.