- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పెళ్లికూతురిని కత్తితో పొడిచిన వరుడి తల్లి..!
by Sumithra |

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని అనంతపురం జిల్లా రాయదుర్గంలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. తన కుమారుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న బాలికపై ఓ మహిళ విచక్షణా రహితంగా కత్తితో దాడికి పాల్పడింది. ఆ సమయంలో మైనర్ పెళ్లిబట్టల మీద ఉన్నట్లు సమాచారం.
స్థానికులు వెంటనే బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, తన కుమారుడికి మాయమాటలు చెప్పి బాలిక పెళ్లి చేసుకుందని తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story