- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కత్తితో దాడి.. పరిస్థితి విషమం
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్ :
చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. దినేష్ అనే యువకుడిపై నిఖిల్ చౌదరి అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు రామనగర్ కాలనీలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. ఇంటివద్దనున్న దినేష్‌ను నిఖిల్ చౌదరి కత్తితో పొడిచాడు.
వెంటనే అతన్ని సీఎంసీకి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ దాడికి పాత కక్ష్యేలే కారణమయి ఉంటాయని ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నపోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Next Story