- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మర్డర్ స్కెచ్.. స్నేహం ముసుగులో కత్తితో దాడి..!

దిశ, జల్‌పల్లి : స్నేహితుడిపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తిని బాలాపూర్పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాలాపూర్ఇన్స్పెక్టర్ భాస్కర్కథనం ప్రకారం.. బండ్లగూడకు చెందిన మహ్మద్ మూసా, తయ్యబా కాలనీకి చెందిన మహ్మద్జబ్బార్లు స్నేహితులు. వీరి మధ్య ఉన్న పాత కక్ష్యలు ఉన్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలోనే మహ్మద్జబ్బార్..మహ్మద్మూసాను ఎలాగైనా మట్టుబెట్టాలని ప్లాన్ చేశాడు. నీతో మాట్లాడేది ఉందంటూ ఈ నెల 23వ తేదీన అర్థరాత్రి ముసాను పిలిచాడు. పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న కత్తితో ముసాపై ముఖం, తల భాగాలపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ముసా అతని నుంచి తప్పించుకుని బాలాపూర్పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బాలాపూర్ పోలీసులు పరారీలో ఉన్న మహ్మద్జబ్బార్ను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.