- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాగ్రత్త…! కేంద్రంలో మా ప్రభుత్వమే ఉంది
దిశ, మునుగోడు: వరంగల్ అర్బన్ జిల్లా బీజేపీ కార్యాలయం ముందు ఎంపీ అరవింద్ కాన్వాయిపై దాడికి నిరసిస్తూ సీఎం కేసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో జాతీయ రహదారి పై బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ…నిన్న బీజేపీ ఎంపీ కాన్వాయిపై దాడి చేసిన తెరాస కార్యకర్తలను అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. లేదంటే కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే అని ఇలాంటి దాడులను సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మండలం, మున్సిపల్ అధ్యక్షులు రిక్కల సుధాకర్ రెడ్డి, ఊడుగు వెంకటేష్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూడల బిక్షంగౌడ్, జిల్లా కోశాధికారి బత్తుల జంగయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు గుజ్జుల సురేందర్ రెడ్డి,పాలకూర్ల జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా..
సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి కృష్ణయ్య రాష్ట్ర నాయకులు ఫోర్సు వేలంగి రాజుల ఆధ్వర్యంలో పట్టణంలోని చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలో చేస్తున్న అవినీతిని ప్రశ్నించినందుకు దాడులకు దిగుతున్నారని ప్రజాస్వామ్యంలో సాధన పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంటుందని, అందరిపై భౌతిక దాడులు దిగటం అప్రజాస్వామికం అన్నారు. కేసీఆర్ కనుసన్నల్లో ఈ దాడి జరిగిందన్నారు. తెలంగాణలో బీజేపీకి ప్రజల ద్వారా వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులకు దిగుతున్నరాని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అనంతరం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ఉపాధ్యక్షులు అక్కిరాజు యశ్వంత్, నకిరేకంటి జగన్ చిలుకూరి శ్రీను, వంగాల పిచ్చయ్య, కళ్యాణ్, సతీష్ తదితరులు