- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అక్కడ ప్రభుత్వం.. అన్ని వసతులు కల్పిస్తుంది
దిశ, పటాన్‌చెరు: అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగుడ ప్రభుత్వ పాఠశాలలో కౌన్సిలర్ ఎడ్ల రమేష్‌తో కలిసి మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నర్సింహాగౌడ్ సోమవారం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నందారం నర్సింహాగౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం అన్ని వసతులను కల్పిస్తుందన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పాఠశాలను నడిచే పరిస్థితులు లేనందున విద్యార్థులు ఇంటి వద్దనే చదువుకోవాలని సూచించారు. విద్యార్థులకు సమస్యలు ఏమైనా ఉంటే సంబంధిత ఉపాధ్యాయులను సంప్రదించాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. విద్యార్థులు చక్కగా చదువుకుని మంచి మార్కులు సాధించి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని అన్నారు.