తక్కువ ధరలో రిలయన్స్ స్మార్ట్‌ఫోన్

by Anukaran |
తక్కువ ధరలో రిలయన్స్ స్మార్ట్‌ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: దిగ్గజ సంస్థ రిలయన్స్ (Reliance) ఇండస్ట్రీస్ రానున్న రెండేళ్లలో చౌక ధరకే లభించే 20 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లను తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం భారత్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని స్థానిక సరఫరాదారులను కోరింది. ఇప్పటికే టెలికాం రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన సమయంలో స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీనిలో కూడా తనదైన ముద్ర వేయాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేశ్ అంబానీ భావిస్తున్నారు.

ప్రస్తుతం దేశీయ స్మార్ట్‌ఫోన్ రంగం (Domestic smartphone sector)లో చైనాకు చెందిన షావోమీ కంపెనీ ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో ప్రవేశంతో పాటు వృద్ధిని సాధించడం సులభమనే అంచనాలతో రిలయన్స్ సంస్థ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దేశీయ మొబైల్‌ఫోన్ తయారీదారులతో సంస్థ చర్చలు ప్రారంభించిందని, అతి తక్కువ ధరలో రూ. 4 వేలకే స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకురావాలని ముఖేశ్ అంబానీ భావిస్తున్నట్టు సమాచారం.

ఈ స్మార్ట్‌ఫోన్‌లు గూగుల్ ఆండ్రాయిడ్ (Google Android) ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనున్నాయి. తద్వారా ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న షావోమీకి పోటీ ఇవ్వాలని లక్ష్యంగా ఉంది. రాబోయే రెండేళ్లలో ఏకంగా 20 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా ఉంది. మార్కెట్ వర్గాల ప్రకారం.. రిలయన్స్ సంస్థ రూ. 4 వేలకే స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఇండస్ట్రీలో భారీ మార్పులు ఉండోచ్చని అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed